హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంగరంగ వైభవంగా దసరా పండగ

SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో గ్రామ దేవత శ్రీ అమ్మవారి తల్లి పండగ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే దివానాలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పండగను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి మొక్కులు చెల్లించుకుంటూ, ముర్రాట్లు వేస్తూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.