హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా ఓపెనర్‌కు ఐసీసీ షాక్

టీమిండియా మహిళా జట్టు స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మకు ఐసీసీ షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో క్యాచ్ డ్రాప్ చేసిన షెఫాలీ కోపంతో బంతిని నేలకేసి కొట్టింది. దీంతో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినట్లు నిర్ధారించిన ఐసీసీ... ఆమెను మందలించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. కాగా, ఈ రెండు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.