KRNL: ఎన్నికల వేళ కోసిగి గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కె. హరి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు


