హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థికి గోల్డ్ మెడల్

KMR: జిల్లాలోని గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి కంది ప్రవీణ్ నిన్న నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొన్నాడు. విన్నర్ ట్రోఫీ, గోల్డ్ మెడల్ సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. చిన్నతనంలోనే గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి కంది ప్రవీణ్‌ను వారు అభినందించారు.