హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల వేళ గొడవలు చేస్తే కఠిన చర్యలు : సీఐ

అన్నమయ్య: రాయచోటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ సీఐ బి.వి. చలపతి హెచ్చరించారు. ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో గుమిగూడడం, ర్యాలీలు, గొడవలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.