NTR: వీరులపాడు మండలం జమ్మవరం గ్రామానికి చెందిన వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి యాదాల సుజాత, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు తమ అనుచరులతో కలిసి 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వీరులపాడులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరికలు


