MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన డ్రైనేజీలలో చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా మందిర్, బస్టాండ్ సమీపంలో మురుగునీటి ప్రవాహం కోసం ప్రధాన రహదారి పక్కన మెయిన్ డ్రైనేజీ ఉంది. అయితే అందులో ఇటీవల చెత్త పేరుకుపోవడం, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు నిలిచిపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
తెలంగాణ
ప్రధాన డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త


