హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌ సెంటర్‌లో ప్రమాదాల భయం

NLG: మాడుగులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ రోజు గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు, మర్రిగూడెంకు చెందిన ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు సమాచారం. గతంలోనూ ఇక్కడ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అధికారులు బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.