NZB: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాను పగలగొట్టి రూ.5 లక్షల నగదు, 10 తులాల బంగారు భరణాలను అపహరించారు. ఉదయం లేచి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
అర్ధరాత్రి భారీ ఛోరి బంగారు మాయం


