హైదరాబాద్: 28°C
క్రీడలు

పాండ్యా కోసం వేల కిలోమీటర్లు నడిచి..!

హార్దిక్ పాండ్యాను కలవడానికి ఓ అభిమాని లక్నో నుండి ముంబై వరకు నడిచి వెళ్లాడు. కానీ హార్దిక్ బెంగళూరులో ఉన్నాడని తెలుసుకుని, అతను అక్కడికి కూడా నడిచి వెళ్ళి చివరకు పాండ్యాను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా పాండ్యా అతడితో ఆప్యాయంగా మాట్లాడాడు. తనకు ఇల్లు లేదని, వీధుల్లో నివసిస్తున్నానని అభిమాని చెప్పడంతో తప్పకుండా సహాయం చేస్తానని పాండ్యా మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.