హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు

W.G: భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ CI రమేష్, ట్రాఫిక్ CI శ్రీనివాసరావులు హాజరై మంగళవారం అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ముందుగా మార్వాడి యువకులు చేసిన దాండియా నృత్యం అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, చందన్ సింగ్, గేవర్ చంద్, దేవరాజ్, శాంతి లాల్, భరత్, తదితరులు పాల్గొన్నారు.