NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ప్రజలకు రూరల్ ఏఎస్ఐ, వీపీఓ ఎంఎం రాజు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత అమ్మవారి ఊరేగింపు నిర్వహించే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు ఏర్పాటు చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
దుర్గమ్మ ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు


