హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచే ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర..!

KMM: దసరా సందర్భంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నుంచి పలు  జిల్లాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వాహన పూజలతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. దుకాణాల వద్ద భక్తులు బారులు తీరారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.