హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

JGL: జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో వేడుకలు జరిగే ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.