హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాత చండీ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHPL: గణపురం మండలం బుద్ధారం గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం దుర్గామాత చండీ  హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సతీమణి పద్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.