హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంపేటలో సీసీ కెమెరాల ఏర్పాటు

KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ భద్రతకు ఇవాళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఎండీ సల్మా సొంత నిధులతో ప్రధాన కూడలిలో రెండు సీసీ కెమెరాలు బిగించారు. దసరా పర్వదినాన ఏఎస్సై సంపత్ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు ఉపయోగపడతాయని సల్మా తెలిపారు. సర్పంచ్ శ్రీలత, ఉప సర్పంచ్ రాజేశం పాల్గొన్నారు.