KNR: దసరా సందర్భంగా కరీంనగర్ బొమ్మకల్లోని శ్రీ యజ్ఞవరాహ స్వామి క్షేత్రంలో మంగళవారం శమీపూజలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా హాజరై అపరాజిత హోమం, ఆయుధ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి పారువేట ఉత్సవం కనులవిందుగా సాగింది. వర్షాభావం తొలగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు గంగుల తెలిపారు.
తెలంగాణ
యజ్ఞ వరాహ స్వామి క్షేత్రంలో శమీ పూజ చేసిన ఎమ్మెల్యే


