హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వీపర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ధర్నా

WNP: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 141 మంది స్వీపర్ల మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాల నిధులు జెడ్పీకి వచ్చినా, సంబంధిత అధికారి ఎస్టీఓకు లేఖ పంపకపోవడంతో వేతనాలు అందలేదని నాయకులు మోష, శ్రీరామ్, భాస్కర్ ఆరోపించారు.