హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేవెళ్లలో యువతి అదృశ్యం

RR: చేవెళ్ల టీచర్స్ కాలనీకి చెందిన పుట్ట అలివేలమ్మ (20) ఇంటి నుంచి బ్యాగుతో బయటకు వెళ్లి అదృశ్యమైంది. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త బాలరాజ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.