హైదరాబాద్: 28°C
తెలంగాణ

అఫ్జల్‌సాగర్‌లో కార్పొరేటర్ పర్యటన

HYD: మల్లేపల్లి డివిజన్‌లోని అఫ్జల్‌సాగర్ ముస్లిం ధోబీఘాట్ ప్రాంతంలో AIMIM కార్పొరేటర్ జాఫర్ పర్యటించారు. ప్రైమరీ యూనిట్ అధ్యక్షులతో కలిసి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలపై సంబంధిత అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కార్పొరేటర్‌కు వివరించారు.