హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో పటిష్ట నిఘా

PLD: స్థానిక ఎన్నికల వేళ ఎస్పీ ఆదేశాలతో చిలకలూరిపేట రూరల్ పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. జిల్లా సరిహద్దుల్లో, తాతపూడి నేషనల్ హైవే, యూటీ సెంటర్, ఈవూరివారిపాలెం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎస్సై జీ.అనిల్ కుమార్ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వస్తువులు జప్తు చేస్తామని హెచ్చరించారు.