హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్‌ల పరిశీలన పూర్తి'

NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నందిగామ పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్‌లు పరిశీలన పూర్తయింది. వార్డు సభ్యుల కోసం దాఖలైన 169 నామినేషన్‌లలో 166 ఆమోదం పొందగా, మూడు తిరస్కరించబడ్డాయి. చైర్‌పర్సన్ పదవికి 19 నామినేషన్ లు చెల్లుబాటు అయ్యాయి. నామినేషన్‌ల ఉపసంహరణకు అక్టోబర్ 21, 2026, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని కమిషనర్ జి. లోవరాజు తెలిపారు.