KNR: శంకరపట్నం మండలం మెట్పల్లి జీపీ పరిధిలోని వెంకటేశ్వర్లపల్లెలో సద్దుల బతుకమ్మ తర్వాత నిమజ్జన ఏర్పాట్లు లేక బతుకమ్మలను రోడ్డు పక్కనే వదిలేశారు. కుంటలు, చెరువుల్లో నీరు లేకపోవడమే కారణం. తొమ్మిది రోజులు కొలిచిన బతుకమ్మను ఇలా వదిలేయడం అగౌరవమని గ్రామస్తులు ఆవేదన చెందారు. పాలకవర్గం తీరుపై మండిపడి, వెంటనే నిమజ్జన ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రోడ్డు పక్కన బతుకమ్మలు!


