హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోల్తాపడిన 102 అంబులెన్స్.. తప్పిన పెను ప్రమాదం

SRPT: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని గ్రామ టర్నింగ్ వద్ద 102 అంబులెన్స్ అదుపుతప్పి ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే, ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో రోగులు ఎవరూ లేకపోవడంతో పాటు, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.