హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్నేహితుడి కుటుంబానికి రూ.36 వేల ఆర్థిక సాయం

E.G: సీతారాంపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996–2001 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ స్నేహితుడు గెట్టిబోయిన దుర్గయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. సోమవారం మిత్రులంతా కలిసి రూ. 36,000 ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టకాలంలో స్నేహితుడి కుటుంబానికి తోడుగా నిలిచిన మిత్రబృందాన్ని పలువురు అభినందించారు.