హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా బతుకమ్మ సంబరాలు

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో నవరాత్రుల సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో సోమవారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, బతుకమ్మ చుట్టూ ఆడుతూ తెలంగాణ సాంప్రదాయ పాటలకు బతుకమ్మలు వేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.