KKD: ఏలేశ్వరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కవాతు నిర్వహించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఐ బి. సూర్య అప్పారావు, ఎస్సై రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో వజ్ర వాహనాలతో ప్రధాన వీధుల్లో కవాతు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో ఏలేశ్వరంలో పోలీసుల కవాతు


