హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MGC మార్కెట్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

BPT: చీరాల పట్టణంలోని MGC మార్కెట్ నందు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్కెట్ వ్యాపారస్తులు, భక్తులు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. తప్పేట్లు, మేళతాళాలతో కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.