హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి ఆకివీడు జడ్పీటీసీ రాజీనామా

W.G: ఆకివీడు జడ్పీటీసీ సభ్యుడు వేగేశ్న వెంకటరాజు అలియాస్ డగండి శీను వైసీపీకి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుకు లేఖ పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆయన ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది.