SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో దసరా బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు హనుమంతుని వాహనంపై స్వామివారిని ఊరేగించారు. బతుకమ్మ పర్వదినాన రథోత్సవంలో మహిళలు మంగళహారతులు సమర్పించారు. సోమవారం గరుడ వాహన సేవ, దసరా రోజు అశ్వవాహనంపై ఊరేగింపు, జమ్మి పూజతో ఉత్సవాలు ముగియనున్నట్లు చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు.
తెలంగాణ
నారాయణపూర్ లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం


