హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఐజీ

అనకాపల్లిలోని ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని సోమవారం విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.