సత్యసాయి జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
వార్తలు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: కలెక్టర్


