హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

MDK: తూప్రాన్ మండలంలో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ పట్టణంతో పాటు ఇస్లాంపూర్, మల్కాపూర్, దాతర్‌పల్లి, వెంకటరత్నాపూర్ తదితర గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. గునుగు, తంగేడు, బంతిపూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.