హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

KDP: విజయదశమి సందర్భంగా కడప జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.