హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

AKP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యలమంచిలి పట్టణంలో పోలీసులు వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.