హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోన్ యాప్‌ల వేధింపులు.. యువకుడు అదృశ్యం

RR: చేవెళ్ల PS పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డి (28) ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపుల నేపథ్యంలో అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. రుణాలు చెల్లించినప్పటికీ మార్ఫింగ్ ఫొటోలతో బెదిరించి, పరిచయస్థులకు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 18న తెల్లవారుజామున స్కూటీపై ఇంటి నుంచి వెళ్లిన అతడి ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.