NLG: నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 73.5 మార్కులతో రాష్ట్రస్థాయి కాయకల్ప అవార్డు దక్కిందని సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఆసుపత్రిలో రోజూ 350 మంది వరకు ఔట్ పేషెంట్లకు, 40 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ గుర్తింపు వైద్యులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితమని తెలిపారు.
తెలంగాణ
కాయకల్ప అవార్డు సాధించిన కమలా నెహ్రూ ఆసుపత్రి


