హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాదంలో దేమి కలాన్ సింగిల్ విండో

KMR: తాడ్వాయి మండలం దేమి కలాన్ సింగిల్ విండో నామినేటెడ్ పదవుల్లో డైరెక్టర్ పోస్టుల్లో ఆరు పోస్టులు గ్రామానికి చెందిన వారికి కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో తమ గ్రామానికి కేవలం రెండు పోస్టులు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ఆరు డైరెక్టర్ పోస్టులను కేటాయించే వరకు ఆందోళన చేస్తామన్నారు.