హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూనిఫామ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ADB: యూనిఫామ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. సోమవారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌ను SP ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తుపై సమీక్షించారు. సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వర్తించి, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలని ఆదేశించారు. ASP రిత్విక్ సాయి, సిబ్బంది తదితరులు ఉన్నారు.