NLG: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నల్గొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో పోలీసులు సోమవారం మెరుపు తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు, గంజాయి, మత్తు టాబ్లెట్ల వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచి మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
59 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


