హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి లైట్లు లేక చీకటమయం

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి నిమ్స్ బ్రిడ్జి కింద ఉన్న రహదారి అంతా చీకటమయంగా దర్శనమిచ్చింది. ఈ రహదారిలో ఎమ్మార్వో ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్ ముఖ్యమైన కార్యాలయాలు ఉన్నాయి. ఈ రహదారి అంతా లైట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని డా. నాడిశెట్టి శాంతారావు సోమవారం తెలిపారు. ఈ విషయమై నగర పంచాయతీ స్పందించి లైట్లు వేయాలని కోరారు.