KMR: జుక్కల్ లో నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నాయకుడు ప్రశాంత్ పటేల్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు రోజుకు కనీసం రెండుసార్లు వాటర్ ట్యాంకర్‌తో రోడ్డుపై నీళ్లు చల్లాలని అధికారులను కోరారు.
తెలంగాణ
'సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలి'


