SRCL: కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ బుర్ర వేణి కూతురు శ్రీజ ఉస్మానియా మెడికల్ కాలేజీలో బీడీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్ గోపాడి సురేందర్ రావు ఆమెను ఘనంగా సన్మానించారు. శ్రీజ సాధించిన విజయం గ్రామానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థినికి సన్మానం


