WNP: పట్టణంలోని నాగవరం ఎస్‌బీఐ బ్యాంక్ ఎదుట అక్టోబర్ 16న రాత్రి 10:30 గంటల సమయంలో బైక్ ఢీకొని గంధం విజయ్ కుమార్ (23) గాయపడ్డాడు. అజాగ్రత్తగా బైక్ నడిపి ఢీకొట్టినట్లు బాధితుడి తండ్రి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన యువకుడికి మహబూబ్‌నగర్‌లోని నేహా షైన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎస్‌ఐ రిషికేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
బైక్ ఢీకొని యువకుడికి గాయాలు.. కేసు నమోదు


