హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

కాకినాడ జిల్లాలో ZPTC, MPTC ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో SP బిందుమాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.