హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెక్కపై కనకదుర్గమ్మ వారి రూపం

AKP: విజయదశమి సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి తన ప్రతిభను చాటుకున్నారు. చెక్కపై కనకదుర్గ అమ్మవారి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించేందుకు రెండు గంటల సమయం పట్టిందని తెలిపారు. పండుగ వేళ అమ్మవారి రూపాన్ని చెక్కపై తీర్చిదిద్దిన రవి కళానైపుణ్యాన్ని పలువురు అభినందించారు.