హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో 24 నామినేషన్లలో 12 తిరస్కరణ

TPT: తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ పదవికి దాఖలైన నామినేషన్ల పరిశీలనలో 12 నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 24 నామినేషన్లు దాఖలు కాగా, మరో 12 తిరస్కరణకు గురయ్యాయి. చెల్లుబాటైన నామినేషన్లలో టీడీపీ నుంచి 3, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నుంచి ఒక్కొక్కటి, ఇతర పార్టీల నుంచి 2, స్వతంత్రుల నుంచి 2 ఉన్నాయి.