హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా ఉత్సవాలకు ముస్తాబైన మైదానం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదికను అలంకరించారు. రావణ దహనానికి భారీ కట్టడాలు ఏర్పాటు చేయడంతో పాటు మైదానం చుట్టూ కాషాయ జెండాలు కట్టారు. వాటర్ ట్యాంక్‌ పై గాలిబెలూన్ ఏర్పాటు చేశారు. గాయని మధుప్రియ ప్రదర్శన ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.