హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేగుంటలో బతుకమ్మ వేడుకలు

MDK: సద్దుల బతుకమ్మ వేడుకలను చేగుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బతుకమ్మ ఘాట్‌ల వద్ద విద్యుత్ దీపాల ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా SI చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.