GNTR: సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, చెప్పినవన్నీ చేశాం కాబట్టే ఓటు అడిగే హక్కు కూటమికి ఉందని MLA బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులో 'చెప్పాం.. చేస్తున్నాం' పోస్టర్ను ఆవిష్కరించారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టామన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్: ఎమ్మెల్యే


